Advertisement

  • దేశంలో అత్యంత సంతోషకర రాష్ట్రంగా మిజోరం ..9వ స్థానంలో తెలంగాణ

దేశంలో అత్యంత సంతోషకర రాష్ట్రంగా మిజోరం ..9వ స్థానంలో తెలంగాణ

By: Sankar Thu, 17 Sept 2020 4:36 PM

దేశంలో అత్యంత సంతోషకర రాష్ట్రంగా మిజోరం ..9వ స్థానంలో తెలంగాణ

దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రాల్లో మిజోరం తొలి స్థానాన్ని ఆక్రమించుకున్నది. కాగా, కొత్త రాష్ట్రమైన తెలంగాణ 9వ స్థానంలో నిలిచి మిగతా పాత పెద్ద రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. ఐఐటీ, మాజా ఐఐఎం ప్రొఫెసర్ రాజేశ్ పిలానియా ఇటీవల నిర్వహించిన అధ్యయనం ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను విడుదల చేశారు.

హ్యాపీనెస్ ఇండెక్స్ లో చిన్న రాష్ట్రమైన మిజోరం తొలిస్తానంలో నిలువగా.. పంజాబ్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, సిక్కిం, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ లు వరుసగా 2 నుంచి 10 వ స్థానం సంపాదించుకున్నాయి. అత్యంత వెనుకబడిన పది రాష్ట్రాలుగా ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఒడశా, మేఘాలయ, గోవా, రాజస్థాన్, నాగాలాండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్ నిలిచాయి. ఈ అధ్యయనం 2020 మార్చి నుంచి జూలై వరకు 16,950 మందిపై నిర్వహించగా.. వివాహం చేసుకున్నవాళ్లు సంతోషంగా ఉన్నట్లు తేలింది. ఒంటరి వ్యక్తుల కంటే వివాహితులు ఎక్కువ సంతోషంగా గడుపుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది

హ్యాపీనెస్ ఇండెక్స్ లో ముందడుగు వేసేందుకు 28వ స్థానంలో నిలిచిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. ఇందుకోసం ప్రత్యేకంగా ఆనంద్ విభాగాన్ని ఏర్పాటుచేసింది. నిజానికి ఈ విభాగం 2016 లో స్థాపించి.. 2018 లో మత శాఖతో ఆనంద్ విభాగాన్ని విలీనం చేసి కొత్తగా ఆధ్యాత్మికత శాఖను ఏర్పాటుచేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.48 కోట్ల బడ్జెట్ ను ప్రభుత్వం కేటాయించింది.

Tags :
|
|

Advertisement