Advertisement

  • రిటైర్మెంట్ తర్వాత మానసిక క్షోభతో యుద్ధం చేస్తున్నాను ..ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్

రిటైర్మెంట్ తర్వాత మానసిక క్షోభతో యుద్ధం చేస్తున్నాను ..ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్

By: Sankar Wed, 28 Oct 2020 5:06 PM

రిటైర్మెంట్ తర్వాత మానసిక క్షోభతో యుద్ధం చేస్తున్నాను ..ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్


అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత తాను మానసిక క్షోభతో యుద్ధం చేస్తున్నట్లు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ జాన్సన్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాకు చానెల్‌ 7కు ఇంటర్య్వూ ఇచ్చిన జాన్సన్‌ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

రిటైర్మెంట్‌ తర్వాత జీవితంలో చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నా. కానీ ఇలాంటి పరిస్థితులను చిన్న వయసులోనే ఎదుర్కొన్నా.. ఆట ముగిసిన తర్వాత రూమ్‌కు వెళ్లాకా ఎన్నోసార్లు ఒంటరితనంగా ఫీలయ్యేవాడిని. కుటుంబానికి దూరంగా నివసించడం లాంటివి నన్ను నిరాశకు గురిచేసేవి. క్రికెట్‌లో భాగంగా అవన్నీ పట్టించుకునేవాడిని కాను. అలా కెరీర్‌ మొత్తం మానసికక్షోభకు గురయ్యేవాడిని..అయితే ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మాత్రం జీవితంలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నా.

ఎందుకో తెలియదు గానీ ఆటకు దూరమైన తర్వాత కుటుంబానికి దగ్గరగా ఉంటున్నా ఏదో తెలియని ఒంటరితనం నన్ను నిరాశకు గురిచేస్తుంది. వీటన్నింటి నుంచి బయటపడడానికి.. నా మెదుడును యాక్టివ్‌గా ఉంచుకోవడానికి కొన్ని పనులను అలవాటు చేసుకున్నా. క్రికెట్‌ ఆడేటప్పుడు ఇలాంటి ఒంటరితనాన్ని ఎన్నోసార్లు అనుభవించా... మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్‌ సిరీస్‌.. 2011లో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో క్రికెట్‌ను అంతగా ఎంజాయ్‌ చేయలేకపోయా.' అంటూ జాన్సన్‌ తెలిపాడు.

అయితే ఆస్ట్రేలియా జట్టు తరుపున ఆడిన అత్యుత్తమ ఫాస్ట్ బావెర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన జాన్సన్ తన పదునైన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూయించాడు..ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరిగే యాషెస్ సిరీస్ లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో అలరించాడు ..అయితే తక్కువ ఏజ్ లోనే క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు.73 టెస్టుల్లో 313 వికెట్లు, 153 వన్డేల్లో 239 వికెట్లు,30 టీ20ల్లో 38 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు 2015లో ఆసీస్‌ వన్డే వరల్డ్‌కప్‌ గెలవడంలో మిచెల్‌ జాన్సన్‌ ప్రధాన పాత్ర పోషించాడు.

Tags :

Advertisement