Advertisement

  • అరుణాచల్ ప్రదేశ్ నుండి తప్పిపోయిన యువకులు చైనా భూభాగంలో

అరుణాచల్ ప్రదేశ్ నుండి తప్పిపోయిన యువకులు చైనా భూభాగంలో

By: chandrasekar Wed, 09 Sept 2020 09:25 AM

అరుణాచల్ ప్రదేశ్ నుండి తప్పిపోయిన యువకులు చైనా భూభాగంలో


అరుణాచల్ ప్రదేశ్ నుండి తప్పిపోయిన యువకులు చైనా భూభాగంలో ఉన్నట్లు భారత సైన్యం గుర్తించింది. అదృశ్యమైన అరుణాచల్ ప్రదేశ్ యువకులు చైనా ఆధీనంలో ఉన్నట్లు తెలిసిందని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. భారత సైన్యం హాట్‌లైన్ సందేశానికి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) స్పందించిందని ఆయన చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ నుండి తప్పిపోయిన యువకులను వారి వైపు భూభాగంలో కనుగొన్నట్లు చైనా సైనికులు ధృవీకరించారని అన్నారు.

తప్పిపోయిన యువకులను భారత్‌కు అప్పగించడానికి తమ అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు భారత సైన్యానికి పీఎల్‌ఏ చెప్పిందని కిరెన్ రిజిజు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కొందరు యువకులు కనిపించకపోవడంపై వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. వారిని తిరిగి రప్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

వారు కనిపించకపోవడంతో సరిహద్దు దాటి చైనా వైపునకు వెళ్లి ఉంటారని భారత్ ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై చైనా పీఎల్ఏతో సంప్రదింపులు జరుపగా వారు తమ ఆధీనంలో ఉన్నట్లు ధృవీకరించింది. వారి అప్పగింత కోసం సంబంధిత ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొంది. కేంద్ర మంత్రి రిజిజు ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు.


Tags :
|

Advertisement