Advertisement

  • గాంధీ హాస్పిటల్‌లో కరోనా పేషెంట్ డెడ్ బాడీ మిస్సింగ్

గాంధీ హాస్పిటల్‌లో కరోనా పేషెంట్ డెడ్ బాడీ మిస్సింగ్

By: chandrasekar Fri, 12 June 2020 11:30 AM

గాంధీ హాస్పిటల్‌లో కరోనా పేషెంట్ డెడ్ బాడీ మిస్సింగ్


మెహదీపట్నానికి చెందిన రషీద్ కోవిడ్ బారిన పడటంతో జూన్ 9న హాస్పిటల్లో చేరగా బుధవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించగా బంధువులు వచ్చే సరికి కనిపించలేదు. దీంతో బంధువులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు డెడ్ బాడీ ఎలా మిస్సయిందనే విషయమై ఆరా తీశారు.

రషీద్ మృతదేహాన్ని పొరబాటున వేరే వాళ్లకు ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో వాళ్లు బుధవారమే అంత్యక్రియలు నిర్వహించారని తేలింది. రషీద్ మృతదేహం కోసం వెతుకుతున్న ఆయన సోదరుడికి గాంధీ హాస్పిటల్ వర్గాలు ఈ సమాచారం అందించారు. పూర్తి వివరాలకు అతణ్ని సంప్రదించొచ్చని తెలిపారు. గాంధీలో కరోనా పేషెంట్ డెడ్ బాడీ మిస్ కావడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే ఒకరి మృతదేహం బదులు మరొకరి డెడ్ బాడీని అప్పగించడంతో అంత్యక్రియలు చేసే ముందు గమనించిన బంధువులు గాంధీ హాస్పిటల్ వర్గాలకు సమాచారం అందించాయి.

జూనియర్ డాక్టర్లపై కొందరు దాడికి తెగబడ్డారు. తీవ్రమైన పని ఒత్తిడి, సమాచార లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి.

అంతకుముందు హయత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి గాంధీ హాస్పిటల్‌లో కరోనాతో చనిపోగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కుటుంబీకులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషయమై మృతుడి భార్య హైకోర్టును ఆశ్రయించారు.

Tags :
|
|

Advertisement