Advertisement

  • పాక్ క్రికెట్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకున్న ఆ దేశ దిగ్గజ ఆటగాడు

పాక్ క్రికెట్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకున్న ఆ దేశ దిగ్గజ ఆటగాడు

By: Sankar Wed, 14 Oct 2020 5:38 PM

పాక్ క్రికెట్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకున్న ఆ దేశ దిగ్గజ ఆటగాడు


ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాన కోచ్, చీఫ్ సెలెక్టర్ గా మిస్బా-ఉల్-హక్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కానీ ఇప్పుడు అతను తన సెలెక్టర్ పదవి నుండి తప్పుకుంటున్నాడు. ఇక నుండి అతను కేవలం కోచ్ గా మాత్రమే కొనసాగుతున్నాడు.

అయితే గతవారం అక్టోబర్ 8న, మిస్బా తన ఏడాది పనితీరు గురించి చర్చించడానికి పీసీబీ బోర్డు సీఈఓ వాసిమ్ ఖాన్, చైర్మన్ ఎహ్సాన్ మణి మిస్బాతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మిస్బాతో బోర్డు యొక్క కొత్త ఎథిక్స్ కోడ్ గురించి చర్చించారు. అదేంటంటే... జాతీయ బోర్డు యొక్క ఏ ఉద్యోగి కూడా ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడానికి కుదరదు.

అందువల్ల మిస్బా తన చీఫ్ సెలెక్టర్ బాధ్యతల నుండి తప్పుకొని ప్రధాన కోచ్ గా కొనసాగనున్నాడు. అయితే పాక్ త్వరలో జింబాబ్వేకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్ లో మిస్బా పాక్ జట్టుకు కోచ్ గా వ్యవరించనున్నాడు.కాగా పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా మిస్బా కు పేరుంది ..క్రికెట్ కి లేట్ గా వచ్చినప్పటికీ అద్భుత ఆటతీరుతో పాక్ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు..

Tags :

Advertisement