Advertisement

  • తెలంగాణ న్యూ సెక్రటేరియట్ పనులను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్ మరియు మంత్రి వేముల

తెలంగాణ న్యూ సెక్రటేరియట్ పనులను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్ మరియు మంత్రి వేముల

By: Sankar Fri, 06 Nov 2020 4:23 PM

తెలంగాణ న్యూ సెక్రటేరియట్ పనులను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్ మరియు మంత్రి వేముల


నూతన సచివాలయ భవన నిర్మాణ ప‌నుల‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి క‌లిసి ప‌రిశీలించారు. సమీకృత కొత్త సచివాలయానికి ఇప్పటికే ఔట్ లైన్ ముగ్గు పోసిన‌ షాపూర్జీ పాల్లొంజీ నిర్మాణ సంస్థ ప‌నులు ప్రారంభించింది.

పనుల ప్రారంభ సూచకంగా తెలంగాణ‌ ప్రవేశద్వారం సమీపంలో ఈ మధ్యే నిర్మించిన కమాన్ వెనక క‌న్‌స్ర్ట‌క్ష‌న్‌ సైట్ ఈశాన్య భాగంలో నిర్మాణ సంస్థ గొయ్యి తవ్వింది. 2019, జూన్ 26వ తేదీన వేద పండితులు నిర్ణయించిన శుభముహూర్తంలో సమీకృత కొత్త సచివాలయం పనులకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శంకుస్థాప‌న చేసిన విష‌యం తెలిసిందే.

సచివాలయం నిర్మాణ పనులపై గురువారం ఎర్రమంజిల్‌ ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంబంధిత అధికారులు, వర్క్‌ఏజెన్సీలతో సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం మేరకు సచివాలయం నిర్మాణ పనులు 12 నెలల్లో పూర్తి కావాలని సూచించారు

Tags :
|

Advertisement