Advertisement

  • ఉస్మానియా ఆసుపత్రి కొత్తది కడతాము అంటే ప్రతిపక్షాలే అడ్డుపడ్డాయి ..తలసాని శ్రీనివాస్ యాదవ్

ఉస్మానియా ఆసుపత్రి కొత్తది కడతాము అంటే ప్రతిపక్షాలే అడ్డుపడ్డాయి ..తలసాని శ్రీనివాస్ యాదవ్

By: Sankar Thu, 16 July 2020 6:37 PM

ఉస్మానియా ఆసుపత్రి కొత్తది కడతాము అంటే ప్రతిపక్షాలే అడ్డుపడ్డాయి ..తలసాని శ్రీనివాస్ యాదవ్



ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షం నీరు రావడంతో ప్రతిపక్షాలు , ప్రజలు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు ..అసలే కరోనా విజృంభిస్తున్న వేళ ఇలా ఉస్మానియా ఆసుపత్రిలోకి నీరు రావడంతో ప్రజలు బయటపడుతున్నారు ..ఉస్మానియా ఆసుపత్రి అంటేనే సామాన్య పేద ప్రజలు ఎక్కువగా వస్తుంటారు ..అయితే అసలే ప్రైవేట్ ఆసుపత్రులలో ట్రీట్మెంట్ ఫీజు లక్షల్లో అవుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రి ఇలా ఉంటే ఎలా అని ప్రజలు మంది పడుతున్నారు ..

అయితే ఉస్మానియా ఆసుపత్రి భవనాలు కూలితే ప్రతిపక్షాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చి చెప్పారు. పేదల కోసం 27 ఎకరాల్లో ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా నిర్మిస్తామంటే 2015లో ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లాయని ఆయన గుర్తు చేశారు. ఆస్పత్రిని గురువారం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ప్రజల ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని ఉస్మానియా ఆసుపత్రి కేసును హైకోర్టు సూమోటాగా తీసుకుని, పరిష్కరించాలని కోరారు.

2015లోనే ఉస్మానియాను కూల్చి కొత్త భవనాన్ని నిర్మిస్తామన్నామని, కానీ కాంగ్రెస్‌ నాయకులు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, వీహెచ్‌‌లు అడ్డుకున్నారని విమర్శించారు. వీటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్‌ని మీడియాకు చూపించారు. ఏదైనా జరిగితే ప్రతిపక్షాలదే బాధ్యత అని హెచ్చరించారు. బుధవారం వర్షం పడితే కాంగ్రెస్‌ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని, ప్రతిపక్షాలకు మంచి చేసే అలోచన వాటికి లేవని దుయ్యబట్టారు. భవిష్యత్తులో పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement