Advertisement

  • సుమేధ మృతిపై స్పందించిన మంత్రి తలసాని ..తప్పు జరిగింది..సరిదిద్దుకుంటాం

సుమేధ మృతిపై స్పందించిన మంత్రి తలసాని ..తప్పు జరిగింది..సరిదిద్దుకుంటాం

By: Sankar Tue, 22 Sept 2020 7:51 PM

సుమేధ మృతిపై స్పందించిన మంత్రి తలసాని ..తప్పు జరిగింది..సరిదిద్దుకుంటాం


నాంపల్లి, కార్వాన్ ప్రాంతాలకు సంబంధించిన డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లను భోజగుట్టలో కడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. అయితే కోర్టులో కాంగ్రెస్‌ కేసులు వేస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం ఆపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధిరలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ చెక్కులు భట్టి విక్రమార్క పంపిణీ చేస్తారని తెలిపారు. ఓపెన్‌ నాళాలపై క్యాపింగ్ లేకపోవడం బాధాకరమని మంత్రి తెలిపారు. అధికారుల పొరపాటుతో తప్పు జరిగిందని, సరిదిద్దుకుంటామన్నారు..

హైదరాబాద్ అబివృద్దిలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారని, కేటీఆర్ పనితనం గురించి తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్‌ సబ్యులు లొకేషన్ తెలుసుకొని వెళ్ళాలని, లక్ష బెడ్ రూమ్ ఇళ్ల జాబితాలో అప్జల్ సాగర్ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నవ్వుల పాలు అవుతారన్న మంత్రి కాంగ్రెస్ నేతలకు ఓట్లు ఎవరు వేస్తారని ఎద్దేవా చేశారు.150 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకరకరని విమర్శించారు. జీవిత కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ నేతలు చేసే డ్రామాలు ఆపాలని సూచించారు.

ఇక పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్‌ బొంతు రాంమోహన్, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్, మల్కాజిగిరి మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు, స్థానిక ఎమ్మెల్మే, కార్పొరేటర్లపై ఇటీవల మృతి చెందిన చిన్నారి సుమేధ కపూరియా తల్లి సుకన్య కపూరియ నేరేడ్‌మెట్‌ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. వర్షా కాలంలో ఓపెన్‌నాలాలు పొంగి ప్రవహించడం వల్ల ఈస్ట్‌దీనదయాళ్‌నగర్‌ కాలనీతో వరదనీటితో ముంపునకు గురవుతుందన్నారు. ఓపెన్‌ నాలాల సమస్యను పరిష్కారించాలని ఎన్నోసార్లు జీహెచ్‌ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు.

Tags :
|

Advertisement