Advertisement

  • ఆ నీళ్లు తాగితే సగం రోగాలు మటుమాయం ..మంత్రి నిరంజన్ రెడ్డి

ఆ నీళ్లు తాగితే సగం రోగాలు మటుమాయం ..మంత్రి నిరంజన్ రెడ్డి

By: Sankar Mon, 21 Sept 2020 3:44 PM

ఆ నీళ్లు తాగితే సగం రోగాలు మటుమాయం ..మంత్రి నిరంజన్ రెడ్డి


హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో వనపర్తి జిల్లాలోని మిషన్ భగీరథ పనులపై ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఈ చిన్నారెడ్డి, ఎస్ఈ జగన్మోహన్, ఈఈలు మేఘారెడ్డి, సుధాకర్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రజలకు మిషన్ భగీరథ నీళ్ల ప్రాధాన్యం వివరించాలని సూచించారు. ఫిల్టర్ నీళ్లతో అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

సకల అనారోగ్యాలకు ఫిల్టర్ నీళ్లే కారణమని మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లు తాగితే సగం రోగాలు దూరమవుతాయని వివరించారు. మినరల్, ఫిల్టర్ వాటర్ పేరుతో పైసలిచ్చి రోగాలను కొనుక్కుంటున్నాం. ప్రజలను చైతన్యం చేసి ఈ అలవాటును మాన్పించాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ మిగిలిపోయిన ఇబ్బందులపై దృష్టిపెట్టండి. లీకేజీలు, అసంపూర్తి పనులు సరిచేయాలని ఆదేశించారు. వనపర్తి జిల్లాలో తాగునీటికి భవిష్యత్ లో ఏ ఇబ్బందులూ ఉండకూడదన్నారు.

గిరిజన తండాలు, దళిత వాడలకు మిషన్ భగీరథ నీటి కనెక్షన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి నీరందాలి. డిసెంబరుకు వంద శాతం స్థిరీకరణ పూర్తి కావాలి స్పష్టం చేశారు. అప్పాయపల్లి, పెద్దగూడెం, చిట్యాల సమీపంలో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూం ఇండ్లకు వెంటనే కనెక్షన్లు ఇవ్వండని అధికారులను ఆదేశించారు. పాన్ గల్ సమీపంలో నిర్మిస్తున్న వేర్ హౌసింగ్ గోదాంల వద్ద ఉద్యోగులు, హమాలీల గృహాలు రానున్నాయి. అక్కడ కూడా మిషన్ భగీరథ కనెక్షన్లు ఇవ్వాలని మంత్రి సూచించారు.

Tags :

Advertisement