Advertisement

  • అమరావతిలో శాసనరాజధాని వద్దు- మంత్రి కొడాలి నాని

అమరావతిలో శాసనరాజధాని వద్దు- మంత్రి కొడాలి నాని

By: Dimple Tue, 08 Sept 2020 09:48 AM

అమరావతిలో శాసనరాజధాని వద్దు- మంత్రి కొడాలి నాని

రాజధాని కేంద్ర అమరావతిపై రోజుకోవార్త ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ఏర్పాటు చేసిన క్రమంలో తొలినాలుగేళ్లు అక్కడి పరిసరాల్లో రూపురేఖలు మారిపోయాయి. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినతర్వాత అమరావతిని శాసన రాజధానిగా.... విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దీనికి తోడు గవర్నర్‌ చేత ఆమోదం పొందినప్పటికీ.. అమరావతి రైతు పరిరక్షణ సమితి కోర్టును ఆశ్రయించడంతో స్టే విధించారు.

రాజధాని వ్యవహారం హైకోర్టు పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో పేద ప్రజలు ఉండేందుకు వీల్లేని అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి చెప్పినట్లు పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. దీనిపై అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారంటూ సోమవారం మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

అమరావతిలో 55 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానిపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం విడ్డూరమని విమర్శించారు. ఉచిత విద్యుత్తు సంస్కరణల్లో భాగంగా రూ.30 వేల కోట్లతో ఏపీ గ్రీన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయబోతున్నామని, దీన్ని ఏ రైతూ వ్యతిరేకించకున్నా తెదేపా రాద్ధాంతం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. ‘చంద్రబాబుకు ప్రజల్లో బలంలేదు.

ఎమ్మెల్యేలు లేరు. ఉన్నవారు జారిపోతున్నారు. లోకేశ్‌ను ఎమ్మెల్యేను చేయడం ఎవరి వల్లా కాద’ంటూ ఎద్దేవా చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌ వెంటే ఉండి, దుష్ట శక్తులను నిర్వీర్యం చేస్తానని నాని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :
|

Advertisement