Advertisement

  • కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాసిన మంత్రి కేటీఆర్

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాసిన మంత్రి కేటీఆర్

By: Sankar Wed, 23 Dec 2020 9:23 PM

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాసిన మంత్రి కేటీఆర్


కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. రానున్న బడ్జెట్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాల్సిందిగా లేఖ ద్వారా మంత్రి విజ్ఞప్తి చేశారు.

జహీరాబాద్‌ నిమ్జ్‌కు, హైదరాబాద్‌ ఫార్మాసిటీకి ప్రత్యేక నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు నిధులు ఇవ్వడంతో పాటు నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం ప్రాథమిక మూలధనాన్ని వెంటనే అందించాల్సిందిగా విన్నవించారు.

ఫార్మాసిటీలో మౌలిక వసతులకు రూ.4,922 కోట్లు ఇవ్వాలన్నారు. కేంద్ర వార్షిక బడ్జెట్‌లో రూ.870 కోట్లు కేటాయించాలన్నారు. రెండు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి రూ. 5 వేల కోట్ల వ్యయం కానుందన్నారు. రెండు ప్రాజెక్టులను ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో అభివృద్ధి చేయాలని యోచించినట్లు చెప్పారు. 2021-22 బడ్జెట్‌లో ప్రాజెక్టు వ్యయంలో కనీసం సగం మొత్తం కేటాయించాలని కోరారు.

Tags :
|
|

Advertisement