Advertisement

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభించనున్నాకేటీఆర్..!

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభించనున్నాకేటీఆర్..!

By: Anji Fri, 25 Sept 2020 07:35 AM

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభించనున్నాకేటీఆర్..!

ఎప్పటి నుంచో వాయిదాలు పడుతూ వస్తున్న హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు మరో ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం 5:30 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కూడా హాజరు కానున్నారు.

రూ.184 కోట్లతో ఈ తీగల వంతెనను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆసియాలోనే రెండో అతిపెద్ద బ్రిడ్జిగా ఈ కట్టడం రికార్డు కెక్కింది.ఈ కేబుల్ బ్రిడ్జితో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45ను కలుపుతూ ఓ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. బ్రిడ్జితో పాటు ఫ్లై ఓవర్‌ను కూడా కేటీఆర్ ప్రారంభిస్తారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ఫ్లై ఓవర్‌‌కు పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్‌వేగా నామకరణం చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించగా.. నిర్మాణానికి రెండేళ్లు పట్టింది. ఈ బ్రిడ్జిని పూర్తిగా కేబుల్ టెక్నాలజీని ఉపయోగించి చేపట్టారు.

దేశంలో ఈ తరహా టెక్నాలజీతో నిర్మితమైన తొలి బ్రిడ్జి ఇదే కావడం విశేషం. గచ్చిబౌలి, మాదాపూర్‌లో పని చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడనుంది. అంతేకాక, దుర్గం చెరువు వద్ద పర్యటకంగానూ మరింత వృద్ధి చెందనుంది.

Tags :

Advertisement