Advertisement

హైదరాబాద్ ఏమైనా పాకిస్తాన్ లో ఉందా ..కేటీఆర్

By: Sankar Tue, 24 Nov 2020 8:02 PM

హైదరాబాద్ ఏమైనా పాకిస్తాన్ లో ఉందా ..కేటీఆర్

ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ లో ఎటువంటి పంచాయతీలు లేవని అన్నారు.

వరదల కోసం సాయం అడిగితే కేంద్రం నుంచి బదులు లేదని అన్నారు. హైదరాబాద్ పై ఎందుకు సవతి తల్లి ప్రేమ ? మోదీ...తెలంగాణ నీకు ఏం ద్రోహం చేసింది ? అని అయన ప్రశ్నించారు. గల్లీ ఎలక్షన్ కోసం ...ఢిల్లీ నుంచి పెద్ద పెద్డ బిజెపి నేతలు వస్తున్నారని, అక్కడే మీరు చిత్తు చిత్తుగా ఓడిపోయారని అన్నారు. మోదీ అమరావతికి పోయి తట్టెడు మట్టి ఇచ్చిపోయారని ఆయన అన్నారు.

హైదరాబాద్ మీద బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ చేస్తామని అంటున్నారు, హైదరాబాద్ ఏమైనా పాకిస్థాన్ లో ఉన్నదా ? అని ఆయన ప్రశ్నించారు. పేదరికం, నిరుద్యోగము మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో అగయిత్యాలు చేస్తున్న వారిపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని అన్నారు

Tags :
|
|

Advertisement