Advertisement

  • ప్రతిపక్షాలు నోరు పారేసుకోవడానికి ఇది సమయం కాదు ..మంత్రి కేటీఆర్

ప్రతిపక్షాలు నోరు పారేసుకోవడానికి ఇది సమయం కాదు ..మంత్రి కేటీఆర్

By: Sankar Mon, 13 July 2020 3:25 PM

ప్రతిపక్షాలు నోరు పారేసుకోవడానికి ఇది సమయం కాదు ..మంత్రి కేటీఆర్



కరోనా విషయంలో తెలంగాణ విఫలం అయింది అని ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టారు మంత్రి కేటీఆర్ ..కరోనా వైరస్ కట్టడిలో కేసీఆర్ ఫెయిల్ అయితే.. ఈ ప్రపంచంలో ఎవరు పాసయ్యారని మంత్రి ప్రశ్నించారు. కరోనా కేసుల్లో భారత్ మూడో స్థానంలో ఉందని.. అంటే మోదీ కూడా విఫలమయ్యారా? అని మంత్రి ప్రశ్నించారు. కరోనా విషయంలో పాజిటివ్ న్యూస్ ప్రసారం చేయాలని ఆయన మీడియాకు సూచించారు. ఆరోపణలు గుప్పించడానికి ఇది సరైన సమయం కాదని ప్రతిపక్షాలకు కేటీఆర్ హితవు పలికారు.

మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనాలను మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుతున్నారని కొనియాడారు. గత ప్రభుత్వంలో లక్ష్మారెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ భవనానికి శంకుస్థాపన చేశామన్నారు. రాష్ట్రంలో ఏ వైద్య కళాశాల లేనంతగా దీన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. గాంధీ, ఉస్మానియా మెడికాల్ కాలేజీల తర్వాత డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులు ఇక్కడి నుంచే ఉన్నారని కేటీఆర్ తెలిపారు.

ప్రతిపక్షాలు నోరు పారేసుకోవడానికి ఇది సమయం కాదు. ఇప్పటికిప్పుడు వచ్చే ప్రయోజనమేమీ లేదు. కరోనా పరీక్షలు చేయడం లేదనేది అర్థం లేని మాట. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం చేస్తున్నాం. కరోనా విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయితే.. ఈ ప్రపంచంలో పాసైంది ఎవరో చూపించండి. ఈ సమయంలో కుదిరితే మాట సాయం చేయండి.. ఎవరి శక్తిమేరా వాళ్లు సాయం అందించండి. అంతే కానీ పని చేస్తున్న వారి నైతిక స్థైర్యం దెబ్బతీయొద్దు.

Tags :
|
|

Advertisement