Advertisement

  • తెలంగాణాలో అమెజాన్ భారీ పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

తెలంగాణాలో అమెజాన్ భారీ పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

By: Sankar Fri, 06 Nov 2020 3:42 PM

తెలంగాణాలో అమెజాన్ భారీ పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్


అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా సుమారు రూ. 20 వేల 761 కోట్ల పెట్టుబ‌డులు తెలంగాణ రాష్ట్రంలోకి రావడం పట్ల ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా అమెజాన్ సంస్థ‌కు మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలో రూపొందించిన టీఎస్ ఐపాస్‌తో పాటు ఆక‌ర్ష‌ణీయ‌మైన పాల‌సీల ద్వారా తెలంగాణలోకి పెట్టుబడులు అనేకం వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. అమెజాన్ వెస్ స‌ర్వీసెస్ పెట్టుబ‌డుల‌తో స్థానిక యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడికి సంబంధించి ప్రాథమిక చర్చలను దావోస్ పర్యటనలో ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దావోస్ పర్యటనలో అమెజాన్ సంస్థ ఉన్నతస్థాయి ప్రతినిధులతో ఇందుకు సంబంధించి చేసిన చర్చలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రాష్ట్రానికి వస్తున్న ఈ పెట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలోకి వస్తున్న అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పెట్టుబడి తర్వాత అనేక కంపెనీలు తమ డాటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని, అలాంటి వారందరికీ తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అమెజాన్ లాంటి ప్రఖ్యాత కంపెనీ తన భారీ పెట్టుబడికి తెలంగాణను ఎంచుకోవడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక, వేగవంతమైన పరిపాలనకు నిదర్శనం అని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు

Tags :
|

Advertisement