Advertisement

  • ఖాళీల భర్తీపై దృష్టి సారించండి ..అధికారులకు కేటీఆర్ ఆదేశాలు ..

ఖాళీల భర్తీపై దృష్టి సారించండి ..అధికారులకు కేటీఆర్ ఆదేశాలు ..

By: Sankar Tue, 14 July 2020 2:11 PM

ఖాళీల భర్తీపై దృష్టి సారించండి ..అధికారులకు కేటీఆర్ ఆదేశాలు  ..



ప్రస్తుతం పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యవంతమైన చర్యలు అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. నూతన పురపాలక చట్టం విధివిధానల మేరకు ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించాలన్నారు.

పెరుగుతున్న పట్టణీకరణ, ప్రజలను దృష్టిలో పెట్టుకుని సిబ్బంది అవసరం ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఖాళీల భర్తీపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పట్టణదారుల అవసరాల మేరకు సిబ్బందిని కేటాయించనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రచించాలని అధికారులకు సూచించారు. ఇంజినీరింగ్‌, ఇన్‌ఫా విభాగాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఇక రాష్ట్రంలో కొవిడ్‌-19ను నియంత్రించడానికి వైద్య సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారని మంత్రి కొనియాడారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు కిందిస్థాయి వరకు ప్రాణాలకు తెగించి గొప్పసేవ చేస్తున్నారన్నారు..అయితే ఇంత శ్రమిస్తున్న ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు ..

Tags :
|
|

Advertisement