Advertisement

  • నేను ఏ వ్యాక్సిన్ వేసుకోలేదు ..కరోనా వ్యాక్సిన్ కేవలం బీహార్ ప్రజలకోసమే ...మంత్రి కేటీఆర్ సెటైర్

నేను ఏ వ్యాక్సిన్ వేసుకోలేదు ..కరోనా వ్యాక్సిన్ కేవలం బీహార్ ప్రజలకోసమే ...మంత్రి కేటీఆర్ సెటైర్

By: Sankar Fri, 23 Oct 2020 06:57 AM

నేను ఏ వ్యాక్సిన్ వేసుకోలేదు ..కరోనా వ్యాక్సిన్ కేవలం బీహార్ ప్రజలకోసమే ...మంత్రి కేటీఆర్ సెటైర్


‘కేటీఆర్‌ గారూ ఇటీవల మీరు భారత్‌ బయోటెక్‌ను సందర్శించినప్పుడు కరోనా టీకా అయిన ‘కోవాక్సీన్‌’వేసుకున్నారా? ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఇంతగా జనంలో తిరుగుతున్నా మీకు ఏమీ కాలేదు. లేదా ఇంకేదైనా కారణం ఉందా’అని ట్విట్టర్‌లో ఓ నెటిజన్‌ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు.

దానికి కేటీఆర్‌ సమాధానం ఇస్తూ.. ‘అలాంటిదేమీ లేదు. నేను కోవాక్సీన్‌ టీకా వేసుకోలేదు. అది బిహార్‌ కోసమే రిజర్వ్‌ చేశారట’అని సమాధానం ఇచ్చారు. బిహార్‌లో అందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తామని ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్‌ ఈ ట్వీట్‌ చేసి ఉంటారని భావిస్తున్నారు.

కాగా బీహార్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోలో తాము గెలిస్తే బీహార్ ప్రజలందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయిస్తాము అని ప్రకటించిన విషయం తెలిసిందే..దీని మీద ఇప్పటికే దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి..

Tags :

Advertisement