Advertisement

ప్రైవేట్ ఆసుపత్రులపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

By: Sankar Thu, 30 July 2020 1:13 PM

ప్రైవేట్ ఆసుపత్రులపై  మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం



మంత్రి కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా అంబులెన్సులు ఇస్తా అని చెప్పిన విషయం తెలిసిందే .అయితే తాజాగా ఆయన కరోనా రెస్పాన్స్‌ అంబులెన్స్‌ లను మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి ప్రారంభించాడు..ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్యెల్యేలు పాల్గొన్నారు..

కాగా కరోనా వైరస్‌ బాధితులను ప్రైవేట్‌ ఆస్పత్రులు చేస్తున్న దోపిడీపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ ‌మీడియాలో వచ్చిన ఫిర్యాదుపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ దుర్మార్గం, సిగ్గుచేటని మండిపడ్డారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద్రర్‌ను ట్విటర్‌లో కోరారు..

ఇక తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,811 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 60,717కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 44,572 మంది కోలుకొని వివిధ ఆస్పత్రులను నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది.

Tags :
|
|

Advertisement