Advertisement

  • కేంద్రం మెడలు వంచైనా రైతులకు అండగా పోరాటం చేయాలి ...కేటీఆర్

కేంద్రం మెడలు వంచైనా రైతులకు అండగా పోరాటం చేయాలి ...కేటీఆర్

By: Sankar Sun, 06 Dec 2020 7:00 PM

కేంద్రం మెడలు వంచైనా రైతులకు అండగా పోరాటం చేయాలి ...కేటీఆర్


వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతు సంఘాలు ఈ నెల ఎనిమిదిన భారత బంద్ కు పిలుపును ఇచ్చిన విషయం తెలిసిందే...ఈ బంద్ కు దేశవ్యాప్తంగా అనేక మంది నుంచి మద్దతు వస్తుంది...అయితే భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్...

తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా.. గల్లీ గల్లీ బంద్ కావాలని.. ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్‌లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుని బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్న నిరాశలో ఉండొదన్న కేటీఆర్... ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. ఎప్పటి లాగే నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్దామన్నారు.

కేంద్రం మెడలు వంచైనా రైతులకు అండగా పోరాటం చేయాలన్నారు. 8వ తేదీన రైతుబంధు కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది.. బంద్ లో పాల్గొంటున్నాము. ప్రతీ వ్యాపారవేత్త 10గంటలకు కాకుండా 12 గంటలకు షాప్స్ తెరవండి- రెండు గంటలు బంద్ పాటించాలని కోరారు.. వాణిజ్య- వ్యాపార సంస్థలు రైతు బంద్ కు సహకరించండి. ట్రాన్స్ పోర్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ బంద్ కు సహకరించండి అని కోరారు.

Tags :

Advertisement