Advertisement

  • రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల రేటు ఘననీయంగా తగ్గింది...మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల రేటు ఘననీయంగా తగ్గింది...మంత్రి కేటీఆర్

By: Sankar Wed, 28 Oct 2020 1:22 PM

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల రేటు ఘననీయంగా తగ్గింది...మంత్రి కేటీఆర్


రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక ప్ర‌కారం అత్య‌ధిక వ్య‌వ‌సాయ రుణాలు మాఫీ చేసిన ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్ర‌మే అని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో చిట్‌చాట్ నిర్వ‌హించారు.

ఇది తాము కొట్టుకుంటున్న డ‌బ్బా కాదు.. ఆర్బీఐ నివేదిక‌లోని పొందుప‌రిచిన అంశాలు అని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 27 వేల కోట్ల వ్య‌వ‌సాయ రుణాలు మాఫీ చేశామ‌ని తెలిపారు. రైతుబంధు ద్వారా మ‌రో రూ. 28 వేల కోట్లు ఇచ్చిన ఘ‌న‌త కేసీఆర్‌ది అని పేర్కొన్నారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి రూ. 56 వేల కోట్లు జ‌మ చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ర్టంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల రేటు గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌న్నారు.

రాష్ట జీఎస్డీపీలో వ్య‌వ‌సాయం పాత్ర 300 రెట్లు పెరిగింద‌న్నారు. రాష్ర్టంలో త‌ల‌సరి ఆదాయం కూడా రెట్టింపు అయింద‌ని తెలిపారు. రైతు బంధు ప‌థ‌కంతో స‌న్న‌, చిన్న‌కారు రైతులకు ప్రయోజనం దక్కిందని ఆర్బీఐ నివేదిక పేర్కొంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Tags :
|

Advertisement