Advertisement

  • వేర్ ఏ మాస్క్ ఛాలెంజ్లో పాల్గొని మరొక అయిదుగురిని నామినేట్ చేసిన మంత్రి కేటీఆర్

వేర్ ఏ మాస్క్ ఛాలెంజ్లో పాల్గొని మరొక అయిదుగురిని నామినేట్ చేసిన మంత్రి కేటీఆర్

By: Sankar Sun, 30 Aug 2020 06:15 AM

వేర్ ఏ మాస్క్ ఛాలెంజ్లో పాల్గొని మరొక అయిదుగురిని నామినేట్ చేసిన మంత్రి కేటీఆర్


కరోనా నేపథ్యంలో మాస్క్‌ ధరించడంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ సోషల్‌ మీడియాలో మాస్క్‌ చాలెంజ్‌ ప్రారంభించింది. దీనిలో భాగంగా తెలంగాణ బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ‘వేర్‌ ఏ మాస్క్‌' చాలెంజ్‌లో మంత్రి కేటీఆర్‌కు చాలెంజ్‌ విసిరారు.

దీనిని స్వీకరించిన మంత్రి కేటీఆర్‌ మాస్క్‌ ధరించిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తనను నామినేట్‌ చేసినందుకు ఆండ్రూ ఫ్లెమింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ చాలెంజ్‌కు మరో ఐదుగురిని నామినేట్‌ చేశారు. నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌, క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ, మేఘాలయ సీఎం కర్నాడ్‌ సంగ్మా వారిలో ఉన్నారు. ఈ చాలెంజ్‌ వల్ల ఇతరుల ద్వారా కరోనా వ్యాపించే ముప్పు నుంచి రక్షణ పొందవచ్చని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇప్పటికే తెలంగాణాలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నడుస్తున్న విషయం తెలిసిందే ..అనేక మంది సెలెబ్రిటీలు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి మరి కొంతమందిని ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినెటే చేసారు..ఇలా చల్ల మంది సీలెబ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటి ప్రజలకు మొక్కల యొక్క ప్రాముఖ్యత వివరించారు..

Tags :
|

Advertisement