Advertisement

  • రైతులు చేపడుతున్న ఆందోళనపై ప్రస్తావించిన మంత్రి కిషన్ రెడ్డి

రైతులు చేపడుతున్న ఆందోళనపై ప్రస్తావించిన మంత్రి కిషన్ రెడ్డి

By: chandrasekar Mon, 14 Dec 2020 3:48 PM

రైతులు చేపడుతున్న ఆందోళనపై ప్రస్తావించిన మంత్రి కిషన్ రెడ్డి


గత కొంత కాలంగా రైతులు కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీ లో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రకటించిన చట్టాల్లో మార్పుల చేసిన అంగీకరించని వీరు చట్టాలనే రద్దు చేయాలనీ ఆందోళన చేస్తున్నారు. రైతులకు నష్టం చేకూర్చే ఏ నిర్ణయాన్ని కేంద్రం తీసుకోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని భాజపా కార్యాలయంలో మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలపై ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే స్పష్టమైన వైఖరిని వివరించినట్లు ఆయన తెలిపారు. రైతులు బాగా సాగు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను తీసుకు వచ్చినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ఇంతకు ముందున్న విధానాలతో రైతులకు ఆశించిన లాభం చేకూరడం లేదని కేంద్ర మంత్రి తెలిపారు. సమగ్రమైన వ్యవసాయ విధానం చేస్తేనే రైతులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో మూతపడిన యూరియా పరిశ్రమలను పునరుద్ధరించి రైతులకు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. రూపాయలు ఆరు వేల కోట్లకు పైగా వినియోగించి కిసాన్ పేరున రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు త్వరలో యూరియా అందనుంది ఆయన తెలిపారు. వ్యవసాయానికి రైతులకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో వ్యవసాయ రంగానికి గుర్తుచేస్తూ ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ కోతలు లేవని అయన తెలిపారు. వ్యవసాయులకు అవగాహన కోసం టీవీ ఛానల్ లలో కావలసిన అన్ని సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు సహాయంగా ఉంటుందని వారికోసం అనేక కార్యక్రమాలు చేప్పట్టి లాభాలు పొందేలా చూస్తుందని తెలిపారు.

Tags :

Advertisement