Advertisement

  • వ్యవసాయ బిల్లులు వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఎందుకు లేఖ రాయలేదు ..మంత్రి కన్నబాబు

వ్యవసాయ బిల్లులు వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఎందుకు లేఖ రాయలేదు ..మంత్రి కన్నబాబు

By: Sankar Sun, 06 Dec 2020 9:27 PM

వ్యవసాయ బిల్లులు వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఎందుకు లేఖ రాయలేదు ..మంత్రి కన్నబాబు


ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని, అబద్ధాలు చెప్పనిదే బాబుకు పూట గడవడం లేదని మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లుకు టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఒకలా..బయట మరోలా మాట్లాడతారు. ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారని బాబు యూటర్న్‌ తీసుకున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఢిల్లీ పెద్దలకు అర్థం కావనే భావనలో ఉన్నారు. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ చంద్రబాబు ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదు? ఎంఎస్‌పీ కొనసాగుతుందని ప్రధాని చెప్పిన తర్వాతే మేం మద్దతు తెలిపామన్నారు కన్నబాబు.కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఎంఎస్‌పీ కొనసాగిస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వ చర్యలను పార్లమెంట్‌లో వివరించాం. రాష్ట్రంలో ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించాం. గ్రామస్థాయిలో మార్కెటింగ్‌ వ్యవస్థను తీసుకొచ్చాం. చంద్రబాబు హయాంలో ఒక్క పంటకు మద్దతు ధర ప్రకటించలేదు. బాబు రైతులకు మేలు చేసే ఆలోచన ఒక్కటైనా చేశారా?' అని మంత్రి విమర్శించారు.

Tags :
|

Advertisement