Advertisement

  • గ్రేటర్ ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

గ్రేటర్ ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

By: Sankar Tue, 17 Nov 2020 10:43 PM

గ్రేటర్ ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి


గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు ఇప్పుడు కాకరేపుతున్నాయి.. ఎవ్వరి అంచనాలు వారికున్నాయి... మరోసారి జీహెచ్‌ఎంసీ పీఠాన్ని అధిష్టించాలని అధికార టీఆర్ఎస్‌ పార్టీ ప్లాన్‌ చేస్తోంది.. ఇప్పటికే అభ్యర్థుల జాబితా సిద్ధం కాగా.. ఇవాళో.. రేపో.. ఒకేసారి 150 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించనున్నారు.

ఇక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100కి పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి... జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల్లో మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మా నిర్లక్ష్యం వల్లే ఓటమిపాలయ్యామని.. కానీ, జీహెచ్‌ఎంసీలో విజయం తమదే అన్నారు.

ఇక, 60 ఏళ్లలో జరగని అభివృద్ధి... హైదరాబాద్‌లో ఆరేళ్లలో టీఆర్ఎస్ సర్కార్ చేసిందన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. బీజేపీ నేతల కామెంట్లపై స్పందించిన ఆయన.. హైదరాబాద్‌కు వరదలు వస్తే కేంద్రం ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని మండిపడ్డారు.. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు

Tags :

Advertisement