Advertisement

  • సిద్దిపేటలో కరోనా ఆసుపత్రిని ప్రారంభించిన హరీష్ రావు ..

సిద్దిపేటలో కరోనా ఆసుపత్రిని ప్రారంభించిన హరీష్ రావు ..

By: Sankar Wed, 15 July 2020 4:42 PM

సిద్దిపేటలో  కరోనా ఆసుపత్రిని ప్రారంభించిన హరీష్ రావు ..



సిద్ధిపేట జిల్లాకేంద్రంలో వంద పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్‌-19 దవాఖానను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి ఐసోలేషన్ వార్డులను పరిశీలించారు. రోగులకు అందించాల్సిన వైద్యంపై వైద్యులతో కాసేపు చర్చించారు. కరోనా వైరస్‌ సోకి దవాఖానకు వచ్చిన రోగులకు, వైద్యుల కోసం సిద్ధంగా ఉంచిన ఎనర్జీ డ్రింక్స్‌, అవి వాడే విధానం, వేడి తాగునీరు అందించడంపై తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.

దవాఖానలో 80 పడకలతో పాటు 20 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. కార్యాక్రమంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజారాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసు, వైద్య అధికారులు, డాక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..

ఇక మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొదట మూడు ప్రైవేట్‌ మెడిక‌ల్ కాలేజీల‌ను ఎంపిక చేసింది. మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించేలా ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది.

Tags :

Advertisement