Advertisement

  • సిద్దిపేటలో కాషాయ వితరణ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు ..

సిద్దిపేటలో కాషాయ వితరణ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు ..

By: Sankar Sat, 25 July 2020 7:55 PM

సిద్దిపేటలో కాషాయ వితరణ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు ..



సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో హరేకృష్ణ మూమెంట్, మెగా కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కషాయ వితరణ కేంద్రాన్ని ఆర్థికమంత్రి హరీష్ రావు శనివారం ప్రారంభించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత కషాయ కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గతంలో పట్టణంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగానే ఇప్పుడు వేడినీరు, కషాయ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ‘కషాయం తాగండి. కరోనాను జయించండి’ అని హరీష్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి సహకరించి ఎవరికివారు కాపాడుకోవాలని సూచించారు. ‘కరోనా కాలంలో ప్రజలెవరూ బయటకు రాకూడదు. అవసరమైతే స్వీయ నియంత్రణ పాటించి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. యోగా, వ్యాయామం చేసే అలవాటున్న వారు ఆరోగ్యంగా ఉంటున్నారు. అందరూ వ్యాయామాన్ని అలవాటుగా చేసుకోవాలి.

సిద్దిపేట నగరంలో మూడు వేడి నీటి కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. వేడి నీరు, కషాయం తాగితే సులువుగా కరోనా నుంచి బయటపడొచ్చు. అందుకే అందరూ వేడినీరు, కషాయం అలవాటు చేసుకోవాలి. కరోనా వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉన్నవాళ్ళకి ప్రభుత్వం తరపున 12 రకాల వస్తువులతో కరోనా కిట్ ఇస్తున్నాం. కరోనా సోకిన వారు ప్రైవేటు ఆస్పత్రులకెళ్లి రూ.లక్షలు ఖర్చు చేయొద్దు.’’ అని మంత్రి హరీష్ రావు మాట్లాడారు


Tags :
|

Advertisement