Advertisement

  • బంగారు తెలంగాణ కావాలా ..కంగారు తెలంగాణ కావాలా ...హరీష్ రావు

బంగారు తెలంగాణ కావాలా ..కంగారు తెలంగాణ కావాలా ...హరీష్ రావు

By: Sankar Mon, 30 Nov 2020 06:25 AM

బంగారు తెలంగాణ కావాలా ..కంగారు తెలంగాణ కావాలా ...హరీష్ రావు


పటాన్ చెరువు లో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ హైదరాబాద్ ను పునర్నిర్మిస్తాం అంటే.. ఒకరు పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ కూల్చుతా అని ఒకరు.. ధారుల్ సలాం కూల్చుతం అని ఒకరు అంటున్నారు.

హైదరాబాద్ కు పెట్టుబడులు తెచుకుందాం.. అభివృద్ధి చేసుకుందాం అని కేసీఆర్ అంటే.. మత ఘర్షణలు సృష్టించాలని భాజపా చూస్తోంది. హైదరాబాద్ లో శాంతి భద్రతలు దెబ్బతీసి.. ఇక్కడి కి వచ్చే పెట్టుబడులు గుజరాత్, ముంబైకి తరలించుకుపోవలని చూస్తున్నాయి. మరో మూడు సంవత్సరాలు తెరాసనే అధికారంలో ఉంటుంది. కానీ ఈరోజు కాళ్లు మొక్కుతున్న భాజపా వాళ్లు.. రేపు కాళ్లు లాగుతారు అని తెలిపారు.

ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న తెరాస ప్రభుత్వాన్ని కూల్చుతాం అని భాజపా అంటోంది. తెరాస బంగారు తెలంగాణ అంటే.. భాజపా కంగారు తెలంగాణ అంటోంది. బంగారు తెలంగాణ కావాలో? కంగారు తెలంగాణ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. సెక్యూలర్ ప్రభుత్వం కావాలంటే తెరాసకు ఓటు వేయాలి అని హరీష్ రావు అన్నారు

Tags :
|
|

Advertisement