Advertisement

  • ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి

By: Sankar Fri, 23 Oct 2020 4:42 PM

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి


ఏపీలో కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నవంబర్ లో నిర్వహించే పరిస్థితి లేదని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు.

కరోనా కొంత తగ్గినట్లు కనిపిస్తున్నా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా ఉందని పేర్కొన్నారు. తాడేపల్లిలో జరిగిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ సమావేశంలో పాల్గొన్న అనంతరం గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నవంబర్ నెలలో కరోనా కాయలు పెరగొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

బీహార్ వంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు తప్పనిసరి అని, మన దగ్గర జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉంటుందని మంత్రి అన్నారు. కాబట్టి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం సహకరించడం లేదు అని ఈ సి హై కోర్ట్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే..

Tags :
|

Advertisement