Advertisement

  • ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడవచ్చన్న మంత్రి గౌతమ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడవచ్చన్న మంత్రి గౌతమ్ రెడ్డి

By: chandrasekar Sat, 24 Oct 2020 09:24 AM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడవచ్చన్న మంత్రి గౌతమ్ రెడ్డి


కరోనా వల్ల స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి‌ క్లారిటీ ఇచ్చారు. మరోసారి కరోనావైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని నిపుణుల నుంచి హెచ్చరికలు ఉన్నాయని ఈ నేపథ్యంలో నవంబరులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమేనని మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలో జరిగిన స్టేట్ లెవల్‌ బ్యాంకర్స్‌ సమావేశంలో గౌతమ్‌రెడ్డి మాట్లాడారు. అయితే బీహార్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు తప్పనిసరి కావున అందుకే ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికలతో మన స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదని ఆయన పేర్కొన్నారు.

ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉంటుందని కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదిలాఉంటే ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 28న రాజకీయపార్టీలతో సమావేశం కానుంది. ఈ మేరకు అన్ని పార్టీలకు కూడా గురువారం సమాచారం అందించింది. ఈ క్రమంలోనే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ రోజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే దసరా తర్వాత నవంబర్, డిసెంబర్‌లో కరోనా సెకెండ్ వేవ్ ఉంటుందన్న నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో తెలియాలంటే ఈనెల 28వరకు ఆగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు ఎప్పుడు తేదీ ఖరారవుతుందో మరి.

Tags :

Advertisement