Advertisement

  • మానేరు జలాశయంలో 30 లక్షల చేప విత్తనాలను వదిలిన మంత్రి గంగుల కమలాకర్

మానేరు జలాశయంలో 30 లక్షల చేప విత్తనాలను వదిలిన మంత్రి గంగుల కమలాకర్

By: chandrasekar Thu, 06 Aug 2020 8:32 PM

మానేరు జలాశయంలో 30 లక్షల చేప విత్తనాలను వదిలిన మంత్రి గంగుల కమలాకర్


రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. ఇందువల్ల ఎగుమతి చేసే అవకాశాలు మరింతగా మెరుగయినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు చేపలు ఎగుమతి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా దిగువ మానేరు జలాశయంలో ఆయన 30 లక్షల చేప విత్తనాలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతేడాది జిల్లాలోని 769 చెరువుల్లో 2 కోట్ల చేప విత్తనాలు వదలగా 7 వేల మెట్రిక్ టన్నులకు పైగా చేపలు ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. కాళేశ్వరం జలాలతో నిండిన 802 చెరువుల్లో 2.36 కోట్ల చేప పిల్లలు వదులుతున్నామని పేర్కొఅన్నారు. గతేడాది కంటే ఈ సారి చేపల దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు.

జిల్లాలో సుమారు 15 వేల మత్స్య కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న తీగల వంతెన వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి మంత్రి గంగుల శంకుస్థాపన చేశారు. జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసినివాళులు అర్పించారు. ఎమ్మెల్యే రామ లింగారెడ్డి మృతికి సంతాపం తెలిపారు. మంత్రి వెంట కలెక్టర్ శశాంక, మేయర్ వై సునీల్ రావు ఇతర అధికారులు ఉన్నారు. అదేవిధంగా కరోనా కారణంగా ప్రజలందరూ సాంగీక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి తగు జాగ్రత్త వహించాలని సూచించారు.

Tags :

Advertisement