Advertisement

  • విదేశాల నుంచి వస్తున్నవారికి ఎయిర్ పోర్ట్ లోనే పరీక్షలు చేయాలి ...తెలంగాణ ప్రభుత్వం

విదేశాల నుంచి వస్తున్నవారికి ఎయిర్ పోర్ట్ లోనే పరీక్షలు చేయాలి ...తెలంగాణ ప్రభుత్వం

By: Sankar Thu, 24 Dec 2020 6:05 PM

విదేశాల నుంచి వస్తున్నవారికి ఎయిర్ పోర్ట్ లోనే పరీక్షలు చేయాలి ...తెలంగాణ ప్రభుత్వం


ప్రపంచ వ్యాప్తం కరోనా స్ట్రెయిన్ వైరస్ విజృంభణ కొనసాగుతుంది...ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుతుంది అని భావిస్తున్న తరుణంలో ఇలా ఈ స్ట్రెయిన్ వైరస్ విజృంభణతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి..కరోనా విజృంభణ సమయంలో జరిగిన పొరపాట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాయి...

తాజాగా కరోనా స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా నిపుణుల కమిటీతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమావేశం కానున్నారు. కరోనా రెండో దశను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. కాగా, విదేశాల నుంచి వస్తున్నవారికి ఎయిర్‌పోర్టులోనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇప్పటికే యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారికి ఎక్కడిక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్రిటన్‌ నుంచి వచ్చినవారిలో 60 శాతం మందిని గుర్తించారు. కాగా, బ్రిటన్‌ నుంచి వచ్చినవారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. పాజిటివ్‌ శాంపిల్స్‌ను సీసీఎంబీకి పంపించారు. కొత్త స్ట్రెయినా కాదా అనే అంశాన్ని నిర్ధారించేందుకు పరీక్షలు చేయనున్నారు.

Tags :
|

Advertisement