Advertisement

  • కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందుగా వారికే ఇస్తాము ..కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందుగా వారికే ఇస్తాము ..కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే

By: Sankar Sun, 16 Aug 2020 11:28 AM

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందుగా వారికే ఇస్తాము ..కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే


శాస్త్రవేత్తలు కరోనా టీకా కోసం నిరంతరం అలుపెరుగకుండా శ్రమిస్తున్నారని, వారి కృషి ఫలించి టీకా అందుబాటులోకి వస్తే కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్న వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికే తొలుత టీకా ఇస్తామని కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే అన్నారు.

శనివారం ఎర్రకోట దగ్గర స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రకటించిన నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ను చౌబే స్వాగతించారు. కాగా, రష్యా టీకా ‘స్పుత్నిక్‌ వీ’ సమర్థతను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఇస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ అన్నారు. కరోనాపై పోరులో ప్రపచంచదేశాలతో పోల్చితే భారత్‌ మెరుగైన స్థానంలో ఉన్నదన్నారు. కరోనా కట్టడిలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

అయితే రష్యా టీకా స్పుత్నిక్‌ పనితీరును మదించిన తరువాత గానీ తాము దాని వాడకంపై ఒక నిర్ణయం తీసుకోలేమని భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అందరి ఆశలూ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ టీకాపైనే నిలిచాయి. ఈ టీకా మూడో దశ మానవ ప్రయోగాలు ఇటీవలే మొదలయ్యాయి. అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లో ఆస్ట్రాజెనెకా సంస్థతో కలిసి జరుగుతు న్న ఈ ప్రయోగాలు మంచి ఫలితాలే ఇస్తున్నాయి. కోవిడ్‌–19 కారక వైరస్‌ను ఎదుర్కొనేందుకు శరీరంలో యాంటీబాడీలను ఉత్పత్తి చేయడంతోపాటు రోగ నిరోధక వ్యవస్థలోని అత్యంత శక్తిమంతమైన టీ–కణాల ఉత్పత్తిని కూడా టీకా పెంచుతున్న ట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Tags :
|
|
|

Advertisement