Advertisement

కరోనా వ్యాక్సిన్ కోసం లక్షల షార్క్ లు బలి...?

By: chandrasekar Sat, 17 Oct 2020 6:56 PM

కరోనా వ్యాక్సిన్ కోసం  లక్షల షార్క్ లు బలి...?


ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో షార్క్ పరిరక్షణ నిపుణుల ఆందోళన ప్రారంభం అయ్యింది. వ్యాక్సిన్ అందాలంటే లక్షల్లో షార్క్ లు బలికాల్సి రావడమే దీనికి కారణం. కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ తీవ్రమవుతోంది. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ భయం వెంటాడుతోంది. అటు కోవిడ్ 19 వ్యాక్సిన్ మాత్రం ఇంకా అందుబాటులో రాలేదు. వ్యాక్సిన్ ఇంకా 2, 3 దశల్లోనే ఉంది. ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురవుతోంది. కరోనా వ్యాక్సిన్ అందాలంటే లక్షల సంఖ్యలో షార్క్ లను బలి చేయాల్సి రావడం. కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉత్తమ మెరుగైన ఫలితాల కోసం షార్క్ లివర్ ఆయిల్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ షార్క్ లివర్ ఆయిల్ ద్వారా దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తి లభిస్తుందని తేల్చారు.

ఈ నేపధ్యంలో కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం లక్షల్లో షార్క్ లను బలి చేయాల్సివస్తుందని షార్క్ పరిరక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల చర్మసౌందర్య ఉత్పత్తుల్లో, మాయిశ్చరైజర్లలో షార్క్ లివర్ ఆయిల్ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న193 రకాల వ్యాక్సీన్ లలో 5-6 కంపెనీలు షార్క్ ఆయిల్ ఉపయోగించాలని నిర్ణయించుకున్నాయి. ఇక బ్రిటన్‌ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను అందించడానికి 100 కోట్ల డోస్‌లు తయారు చేయాలని యోచిస్తోంది.

ఒక్కొక్కరికి ఒక్కొక్క డోస్ ఇచ్చినా సరే 25 లక్షల షార్క్ లు చంపాల్సి ఉంటుందనేది అంచనా. రెండు డోస్ లు ఇవ్వాల్సి వస్తే 50 లక్షల వరకూ షార్క్ లు చంపాల్సి వస్తుంది. అందుకే షార్క్‌ పరిరక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ కోసం షార్క్ లను చంపితే షార్క్‌ల మనుగడకే ముప్పు వాటిల్లవచ్చని హెచ్చరిస్తున్నారు. షార్క్ లివర్ ఆయిల్ కు బదులు షుగర్‌కేన్‌, గోధుమ, ఈస్ట్‌లు, బ్యాక్టీరియా వాడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అన్నిరకాల ప్రత్యామ్నాయాల్ని పరిశీలించిన తరువాతే షార్క్ ఆయిల్ ఉపయోగిస్తామని వ్యాక్సిన్ తయారీదారులు అంటున్నారు.

Tags :
|
|
|

Advertisement