Advertisement

  • చైనా యాప్ ల నిషేధాన్ని స్వాగతిస్తున్నాం ..అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో

చైనా యాప్ ల నిషేధాన్ని స్వాగతిస్తున్నాం ..అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో

By: Sankar Thu, 02 July 2020 10:28 AM

చైనా యాప్ ల నిషేధాన్ని స్వాగతిస్తున్నాం ..అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో



ఇండియా -చైనా మధ్య గత కొద్దీ కాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ..గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులకు అమరులు అయ్యారు ..అయితే ఈ సంఘటనల నేపథ్యంలో చైనా మీద ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు ప్రభుత్వానికి సూచించారు ..చైనా వస్తువులను , చైనా యాప్స్ ను వాడకుండా నిషేదించాలని , చైనాను దెబ్బకొట్టాలని అన్నారు ..అయితే ఈ నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని చైనాకు చెందిన 59 యాప్స్ ను ప్రభుత్వం నిషేదించింది..ఇందులో ఫేమస్ టిక్ టాక్ , హలో యాప్స్ కూడా ఉన్నాయి ..

అయితే టిక్‌టాక్‌, షేర్‌ఇట్‌ సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించడాన్ని అమెరికా సమర్ధించింది. ఈ నిర్ణయం భారత సమగ్రత, జాతీయ భద్రతకు ఉపకరిస్తుందని, చైనా యాప్‌లను భారత్‌ నిషేధించడాన్ని తాము స్వాగతిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో బుధవారం పేర్కొన్నారు.

మరోవైపు చైనా యాప్‌లను భారత్‌ నిషేధించిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్‌ మీడియా బ్లాగింగ్‌ సైట్‌ వీబో నుంచి వైదొలిగారు. చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించడంపై భారత్‌లో చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జి రోంగ్‌ స్పందించారు. ఈ వ్యవహారంపై తమ దేశం తీవ్రంగా కలత చెందుతోందని, ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.

Tags :
|
|

Advertisement