Advertisement

  • చైనా దుందుడుకు చర్యలను అంతర్జాతీయ సమాజం ఖండించాలి ..అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో

చైనా దుందుడుకు చర్యలను అంతర్జాతీయ సమాజం ఖండించాలి ..అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో

By: Sankar Thu, 09 July 2020 12:05 PM

చైనా దుందుడుకు చర్యలను అంతర్జాతీయ సమాజం ఖండించాలి ..అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో



చైనా మీద విమర్శలు చేసే విషయం లో అమెరికా ఏ మాత్రం తగ్గడం లేదు ..తాజాగా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో బుధవారం మాట్లాడుతూ.. డ్రాగన్ వైఖరిని తప్పుబట్టారు. తూర్పు లడఖ్‌లో భారత్‌తో ఇటీవల జరిగిన ఘర్షణలో చైనా చర్యలు నమ్మశక్యం కాని రీతిలో ఉన్నాయని వ్యాఖ్యానించిన ఆయన.. దీనికి దీటుగా స్పందించడానికి భారత్ కూడా తన వంతు కృషి చేసిందన్నారు. తన పొరుగు దేశాలతో చైనా తరచూ ప్రాదేశిక వివాదాలను ప్రేరేపించడమే పనిగా పెట్టుకుందని, ఈ చర్యలను అంతర్జాతీయ సమాజం ఖండించాలని ఆయన కోరారు.

తాజాగా, భూటాన్‌తో సరిహద్దుల్లో చైనా వివాదం గురించి పాంపియో మాట్లాడుతూ.. ‘హిమాలయ పర్వత శ్రేణుల నుంచి వియత్నాం ప్రత్యేకమైన జోన్ సెంకాకు ద్వీపాల జలాల వరకు పొరుగు దేశాలతో ప్రాదేశిక వివాదాలను ప్రేరేపించే విధానాన్ని చైనా అలంభిస్తోంది.. ఇలాంటి బెదిరింపు ధోరణిని ప్రపంచ దేశాలు అనుమతించరాదని’ అన్నారు.

కాగా చైనా మీద అమెరికా కఠిన చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. మహమ్మారి వ్యాప్తితో పాటు వివిధ అంశాల పట్ల డ్రాగన్‌ దుందుడు వైఖరికి తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ కేలే మెకానీ బుధవారం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చైనాపై అధ్యక్షుడు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో ఇప్పుడే చెప్పలేను. అయితే సరైన సమయంలో చైనాపై తీసుకోనున్న చర్యలపై కొన్ని రోజుల్లోనే ఓ వార్త వినబోతున్నారు. అది మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నారు.


Tags :
|
|
|

Advertisement