Advertisement

టిక్‌టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ విముఖత

By: chandrasekar Mon, 03 Aug 2020 12:50 PM

టిక్‌టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ విముఖత


భారత్ మరియు చైనా సరిహద్దు వివాదం కారణంగా చైనా కు సంబందించిన అప్ లపై భారత్ నిషేదించిన విషయం తెలిసిందే. ఇది కాడుందా కరోనా వైరస్ కారణంగా చైనా సంస్థల యాప్‌లపై భారత్ సహా పలు దేశాల్లో నిషేధం కొనసాగుతోంది. ప్రపంచంలోనే ప్రముఖ యాప్‌గా గుర్తింపు తెచ్చుకున్న టిక్‌టాక్ యాప్‌ను భారత్ నిషేధించింది. కరోనా వైరస్ కారణంగా అమెరికా, చైనాల మధ్య రేగిన చిచ్చు కొనసాగుతోంది. ఇప్పటికే పలు చైనా యాప్‌లపై అమెరికాలో నిషేధం కొనసాగుతుంది.

టిక్‌టాక్ యాప్‌ మాతృ సంస్థ బైట్‌డాన్స్‌ను అమెరికా కంపెనీగా గుర్తించాలని ట్రంప్ పట్టుబట్టారని వార్తలు వచ్చాయి. దీనిని చైనా యాప్‌ కాకుండా అమెరికా సంస్థగా గుర్తిస్తే ఎలాంటి నిషేధం విధించబోమని ట్రంప్ చెప్పడంతో టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొనుగులు చేయడానికి సిద్ధమయ్యిందని ప్రచారం జరిగింది. అయితే, టిక్‌టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ఈ పరిస్థితులలో టిక్‌టాక్‌కు చెందిన అమెరికా బిజినెస్‌ను మాత్ర‌మే మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేస్తుంద‌ని కథనాలు వెలువడ్డాయి. టిక్‌టాక్ మార్కెట్ విలువ ప్ర‌స్తుతం 30-50 బిలియ‌న్ డాల‌ర్ల మ‌ధ్య ఉంటుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇదిలా ఉండగా జరుగుతున్న ప్రచారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయమని చెబుతూనే దీర్ఘకాలంలో టిక్‌టాక్ ఒక పెద్ద సక్సెస్ అవుతుందని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. బైట్‌డాన్స్ సంస్థ టిక్‌టాక్‌ను 2017లో ప్రారంభించింది. మరోవైపు, చైనాలోని ఆరు యూనిట్లను భారత్‌కు మార్చే ఆలోచనలో యాపిల్ సంస్థ ఉంది. ఇది కార్యరూపం దాల్చితే దేశంలో కొత్తగా 55 వేల మంది నాణ్యమైన నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.

Tags :
|

Advertisement