Advertisement

  • మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్ లాంచ్...రూ.7 వేలలోపు ధరలోనే

మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్ లాంచ్...రూ.7 వేలలోపు ధరలోనే

By: chandrasekar Tue, 03 Nov 2020 9:27 PM

మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్ లాంచ్...రూ.7 వేలలోపు ధరలోనే


మైక్రోమ్యాక్స్ తన ఇన్ సిరీస్‌లో ఎంట్రీ లెవల్ బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ. రూ.7 వేలలోపు ధరలోనే లాంచ్ అయిన ఈ ఫోన్‌లో హెచ్‌డీ+ డిస్ ప్లేతోపాటు 13 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు అందించారు. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1తో పాటే ఇది కూడా లాంచ్ అయింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వీటిని రూపొందించినట్లు మైక్రోమ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మ పేర్కొన్నారు.

మైక్రోమ్యాక్స్ ఇన్ 1బీ ధర మరియు స్పెసిఫికేషన్లు

ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.6,999గా నిర్ణయించారు.

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. ఈ ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ రెడ్ మీ 9, రియల్ మీ సీ15, పోకో సీ3 ఫోన్లతో పోటీ పడనుంది. దీని సేల్ ఫ్లిప్ కార్ట్‌లో నవంబర్ 26వ తేదీ నుంచి జరగనుంది.

ఇందులో 6.52 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లేను ఇందులో అందించడం విశేషం.

ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ పై మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1బీ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్‌ ఆప్షన్లను ఇందులో అందించారు. దీని స్టోరేజ్ సామర్థ్యం 64 జీబీ వరకు ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, దీంతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను కూడా ఇందులో అందించారు.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.

ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో ఎటువంటి బ్లోట్‌వేర్ లేదు. పూర్తిస్థాయి ఆండ్రాయిడ్ అనుభవాన్ని ఈ ఫోన్ అందిస్తుంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనకభాగంలో అందించారు.

Tags :

Advertisement