మూడు సంవత్సరాలలో అతడికి అదృష్టం రెండు సార్లు తలుపు తట్టింది ..
By: Sankar Tue, 23 June 2020 3:11 PM
లాటరీ గెలుచుకోవాలన్నది ఎంతోమంది కల. జీవితంలో ఒక్కసారైనా దాన్ని గెలుచుకుంటే చాలనుకునేవారు కోట్లల్లో ఉంటారు. కానీ ఓ వ్యక్తికి మాత్రం ఒక్కసారేంటి, రెండుసార్లు లాటరీ తగిలింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అమెరికాలోని మిచిగాన్కు చెందిన మార్క్ క్లార్క్ అనే వ్యక్తి 2017లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అప్పుడు ఒకసారి ఆ లాటరి గెలుచుకున్న క్లార్క్ మళ్ళీ తాజాగా ఇప్పుడు రెండో సారి మళ్ళీ ఆ లాటరి ని దక్కించుకున్నాడు
తాజాగా ఆ లాటరీ టికెట్‌ను పదేళ్ల క్రితం చనిపోయిన తండ్రి కానుకగా ఇచ్చిన నాణెంతో గీకి చూడగా ఆ నంబర్ లాటరీ గెలుచుకుంది. అక్షరాలా నాలుగు మిలియన్ డాలర్లు అతడి సొంతమైంది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు సోమవారం ధృవీకరించారు. కాగా అతడు లాటరీ గెలుపొందండం ఇది రెండోసారి కావడం విశేషం. క్లార్క్ ముందు లాటరీ నిర్వాహకులు రెండు ఆప్షన్లు ప్రవేశపెట్టారు.
దీర్ఘ కాలంలో 4 మిలియన్ డాలర్లు తీసుకుంటారా? లేదా తక్షణమే 2.5 మిలియన్ డాలర్లు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. దీనికి అతడు డబ్బులు అందుకోడానికి ఎక్కువ కాలం వేచి చూడలేనంటూ 2.5 మిలియన్ డాలర్లు అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడుతూ.. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా.. కానీ నేను మళ్లీ లాటరీ గెలిచానంటే అందుకు ఈ నాణెం కారణమని భావిస్తున్నా. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఇప్పుడు దశ తిరిగిపోయినట్లు అనిపిస్తోంది అని పేర్కొన్నాడు..