Advertisement

పృథ్వీ షా కు మరొక అవకాశం ఇవ్వాలి ...హస్సి

By: Sankar Tue, 22 Dec 2020 4:46 PM

పృథ్వీ షా కు మరొక అవకాశం ఇవ్వాలి ...హస్సి


అడిలైడ్ లో టీమిండియా దారుణ ఓటమితో అన్నివైపులా నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి..ముఖ్యంగా యువ ఓపెనర్ షా మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు..షా వైఫల్యం వల్లనే టీమిండియా ఓడిపోయింది అని గిలిక్రిస్ట్ వంటి మాజీలు అభిప్రాయపడ్డారు..దీనితో షా స్థానంలో గిల్ కు బాక్సింగ్ డే టెస్ట్ లో చోటు ఖాయం అని మాజీ ఆటగాళ్లు అంటున్నారు..అయితే షా కు మరొక అవకాశం ఇవ్వాలని అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మిస్టర్ క్రికెట్ హస్సి ...

భారత సెలెక్టర్లు పృథ్వీ షాపై నమ్మకం ఉంచాలి. నిజమే.. అడిలైడ్ టెస్టులో అతను అంచనాల్ని అందుకోలేకపోయాడు.. పరుగులు చేయడంలోనూ విఫలమయ్యాడు. కానీ.. టూర్‌లో అతను ఆడింది ఒక టెస్టు మ్యాచే కదా..? అది కూడా బ్యాటింగ్‌కి కష్టమైన పిచ్‌పై.. ఆస్ట్రేలియా లాంటి నాణ్యమైన బౌలింగ్‌ని ఎదుర్కొని పరుగులు రాబట్టాలంటే కష్టమే.

కాబట్టి.. మెల్‌బోర్న్ టెస్టులోనూ అతనికి అవకాశమివ్వాలి. ఆ పిచ్ అడిలైడ్‌లా ఉండదు.. పృథ్వీ షా బ్యాటింగ్‌కి చక్కగా నప్పుతుంది. పేస్, బౌన్స్ కూడా పెద్దగా ఉండదు’’ అని హస్సీ వెల్లడించాడు.

Tags :
|

Advertisement