Advertisement

  • తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర ...తొలి ఎఫ్ 1 టైటిల్ గెలిచిన సెర్గియో పెరెజ్

తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర ...తొలి ఎఫ్ 1 టైటిల్ గెలిచిన సెర్గియో పెరెజ్

By: Sankar Wed, 09 Dec 2020 9:47 PM

తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర ...తొలి ఎఫ్ 1 టైటిల్ గెలిచిన సెర్గియో పెరెజ్


తొమ్మిదేళ్లుగా టైటిల్ కోసం పట్టువదలకుండా 190 రేస్ ల పాటు పోరాడిన ఫార్ములా వన్ డ్రైవర్ సెర్గియో పెరెజ్‌ ఎట్టకేలకు ఫార్ములావన్‌ (ఎఫ్‌1)లో తొలి టైటిల్‌ను సాధించాడు.

సాఖిర్‌ గ్రాండ్‌ప్రి రేసులో 30 ఏళ్ల పెరెజ్‌ విజేతగా నిలిచాడు. 87 ల్యాప్‌ల ఈ రేసులో రేసింగ్‌ పాయింట్‌ జట్టు డ్రైవర్‌ పెరెజ్‌ అందరికంటే ముందుగా గంటా 31 నిమిషాల 15.114 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

2011లో ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రితో ఫార్ములావన్‌లో అరంగేట్రం చేసిన పెరెజ్‌ తన కెరీర్‌లోని 190వ రేసులో విజేతగా నిలువడం విశేషం. సాఖిర్‌ గ్రాండ్‌ప్రిలో ఐదో స్థానం నుంచి రేసును ఆరంభించిన పెరెజ్‌ మిగతా డ్రైవర్ల తప్పిదాలను తనకు అనుకూలంగా మల్చుకొని తొలి విజయం రుచి చూశాడు. కరోనా బారిన పడటంతో ప్రపంచ చాంపియన్‌ హామిల్టన్‌ (మెర్సిడెస్‌) ఈ రేసులో పాల్గొనలేదు.

Tags :
|

Advertisement