Advertisement

  • మెట్రో రైళ్లకు పచ్చజెండా ..కానీ హైద్రాబాద్లో ఆలస్యం అయ్యే అవకాశం!

మెట్రో రైళ్లకు పచ్చజెండా ..కానీ హైద్రాబాద్లో ఆలస్యం అయ్యే అవకాశం!

By: Sankar Sun, 30 Aug 2020 06:06 AM

మెట్రో రైళ్లకు పచ్చజెండా ..కానీ హైద్రాబాద్లో ఆలస్యం అయ్యే అవకాశం!


కరోనా లాక్ డౌన్ తో నిలిచిపోయినాయి అన్ని ఒక్కొక్కటిగా తిరిగి పార్రంభం అవుతున్నాయి..తాజగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలలో మెట్రో రైళ్లకు సెప్టెంబర్ 7 నుంచి నడుపుకోవచ్చని అనుమతి ఇచ్చింది.. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ సేవలను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. అయితే.. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపలే ఈ సేవలు ప్రారంభించాలని పేర్కొంది.

ఇప్పటికే పలు రాష్ట్రాలు మెట్రో సర్వీసులు ప్రారంభం కోసం కేంద్రాన్ని అనుమతి కోరిన విషయం తెలిసిందే..దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో రైలు సేవలు పునరుద్ధరించడానికి కసరత్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోనూ మెట్రో స‌ర్వీసుల‌ను ప్రారంభించనున్నారు. భ‌ద్రతా ప్రమాణాల మ‌ధ్య నాలుగో వంతు స‌బ‌ర్మన్ రైలు స‌ర్వీసుల‌ను, మెట్రో సేవ‌ల‌ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే తెలిపారు

ఇక కరోనా కేసులు అధికంగానే నమోదు అవుతున్న హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు పునరుద్ధరించే అంశంపై పలు సందేహాలు తలెత్తున్నాయి. మెట్రో మార్గాలు ఉన్న ప్రాంతాల్లో కొన్ని కంటెన్‌మెంట్ జోన్లలో ఉన్నాయి. అంతేకాకుండా.. రైళ్లలో భౌతిక దూరం తదితర నిబంధనలు పాటించేలా చూడటం, శానిటైజేషన్ ప్రక్రియలకు ప్రత్యేక వ్యవస్థను చర్యలు తీసుకోవాల్సి ఉంది. భౌతిక దూరం కోసం 50 శాతం సీటింగ్ కెపాసిటీకే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ మేరకు ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.

Tags :
|

Advertisement