Advertisement

  • మెలోడియస్‌ అలారం టోన్...ఉద‌యాన్నే ఇష్టంగా నిద్ర‌లేవ‌డానికి

మెలోడియస్‌ అలారం టోన్...ఉద‌యాన్నే ఇష్టంగా నిద్ర‌లేవ‌డానికి

By: chandrasekar Tue, 23 June 2020 6:36 PM

మెలోడియస్‌ అలారం టోన్...ఉద‌యాన్నే ఇష్టంగా నిద్ర‌లేవ‌డానికి


ఇప్పటి జ‌న‌రేష‌న్‌కి ఉద‌యాన్నే నిద్ర లేవాలంటే ఎంత క‌ష్ట‌మో ఏదో కొండ‌ని ప‌గ‌ల‌కొట్ట‌మ‌న్న‌ట్లు బ‌ద్ధ‌కంగా ఫీల‌వుతుంటారు. ఎలాగూ లేవ‌ర‌ని తెలుసు. అయినా ఉద‌యాన్నే నిద్ర‌లేచి చ‌దువుకోవాల‌నో, వ్యాయామం చేయాల‌నో అనుకుంటూ అలార‌మ్ పెట్టుకుంటుంటారు. తీరా అలార‌మ్ మోగేస‌రికి ఆఫ్ చేసి మ‌ర‌లా ప‌డుకుంటారు.

దీనికి ఒక ఉపాయం తీసుకొచ్చారు ఆస్ట్రేలియా ఆర్ఎంఐటీ వ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు. ఉద‌యాన్నే అలారం టోన్ మోగ్గానే కొంద‌రికి విసుగు వ‌స్తుంది. ఎందుకంటే ఆ టోన్ క‌ఠోరంగా ఉంటుంది. ఎంత క‌ఠోరంగా ఉన్న‌ప్ప‌టికీ నిద్ర మ‌త్తు మాత్రం వ‌ద‌ల‌దు.

ఆ టోన్‌కు బదులుగా శ్రావ్యంగా ఉండే మరో టోన్‌ను సెట్‌ చేసుకోవాలని, మెలోడియస్‌ అలారం టోన్‌లు విని నిద్ర మేల్కోవచ్చని అంటున్నారు. ఇలా ఉద‌యాన్నే మంచి మ్యూజిక్‌తో మొద‌లైతే దినచర్య కూడా బాగుంటుందని గుర్తించి వివరించారు.

Tags :
|
|

Advertisement