Advertisement

  • మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్‌కు షాక్ ఇచ్చారు...?

మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్‌కు షాక్ ఇచ్చారు...?

By: chandrasekar Thu, 03 Dec 2020 11:03 AM

మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్‌కు షాక్ ఇచ్చారు...?


మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌కు గట్టి షాక్ ఇచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. తండ్రి తగ్గ తనయుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. ఎన్నో యేళ్లుగా ఇండస్ట్రీలో అలరిస్తోన్న చిరంజీవి ఈ యేడాది ఉగాది సందర్భంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్ అయ్యారు.

మరోవైపు రామ్ చరణ్ కూడా మొన్నటి వరకు ఫేస్‌బుక్‌ అనే సోషల్ మీడియాలో మాత్రమే ఉండేవాడు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్, ఆపై ట్విట్టర్‌లో అడుగుపెట్టాడు. ఇక ట్విట్టర్‌లో రామ్ చరణ్‌కు 1 మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మరోవైపు చిరంజీవికి 822.1 K ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా చిరంజీవి తన ట్విట్టర్‌ అకౌంట్‌లో రామ్ చరణ్‌కు అన్ ఫాలో చేసి పెద్ద షాక్ ఇచ్చాడు. అదే సమయంలో చిరంజీవి.. తన దర్శకుడు అనిల్ రావిపూడిని ఫాలో అవ్వడం ప్రారంభించాడు.

కానీ, చిరంజీవి సడెన్‌గా రామ్ చరణ్‌ను అన్ ఫాలో ఎందుకు చేసాడనే విషయమై మెగా వర్గాలు చర్చించుకుంటున్నాయి. కావాలనే చిరంజీవి తన అబ్బాయి రామ్ చరణ్‌ను అన్ ఫాలో చేసాడా పొరపాటున చేసాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో రామ్ చరణ్ నటించనున్నాడు. గతంలో చిరంజీవి.. రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర, బ్రూస్లీ సినిమాల్లో గెస్ట్ పాత్రలో మెరిస్తే.. రాంచరణ్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’లో ఓ పాటలో అతిథిలా మెరిసాడు. మరోవైపు రామ్ చరణ్.. ఇపుడు నిర్మాతగా వరుసగా తన తండ్రి చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సినిమాలు నిర్మిస్తున్నాడు.

Tags :

Advertisement