Advertisement

  • నా స్నేహితుడు త్వరగా కోలుకోవాలి... హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించిన చిరంజీవి

నా స్నేహితుడు త్వరగా కోలుకోవాలి... హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించిన చిరంజీవి

By: Sankar Thu, 22 Oct 2020 2:39 PM

నా స్నేహితుడు త్వరగా కోలుకోవాలి... హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించిన చిరంజీవి


కరోనా ప్రపంచాన్నే చిగురుటాకులా వణికిస్తోంది . ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రెటీలు కూడా ఈ మహమ్మారి బారిన పడటం సామాన్యులకు బెంబేలెత్తిస్తుంది. ఇప్పటికే పలువురు సినిమా తారలు ఈ మహమ్మారి బారిన పడ్డారు తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ కోవిడ్ కారణంగా హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే.

తమ కుటుంబంలో అందరికి కరోనా సోకిందని సోషల్ మీడియా ద్వారా ఇటీవల చెప్పిన ఆయన వీలైనంత త్వరగా అందరం కొలుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసారు . అయితే రాజశేఖర్ కుమార్తె శివాత్మిక తన తండ్రి ఆరోగ్య పరిస్థితి కాస్తా కష్టంగానే ఉందని ట్వీట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ‌శివాత్మిక చేసిన ట్వీట్‌కు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు చిరు . 'డియ‌ర్ శివాత్మిక .. మీ నాన్న‌, నా స్నేహితుడు రాజ‌శేఖర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నా. ధైర్యంగా ఉండండి. అంద‌రి ప్రార్ధ‌న‌ల‌తో రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకుంటారు. మీ కుటుంబం కోసం ప్రార్ధిస్తున్నాను ' అంటూ చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :
|

Advertisement