Advertisement

  • పవర్ స్టార్ కొత్త సినిమాకు మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా టైటిల్ !

పవర్ స్టార్ కొత్త సినిమాకు మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా టైటిల్ !

By: Sankar Tue, 22 Dec 2020 10:32 AM

పవర్ స్టార్ కొత్త సినిమాకు మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా టైటిల్ !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , భల్లాలదేవ రానా కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే...మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోశియుమ్ సినిమా ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు...మలయాళం లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది...

తెలుగులో సాగ‌ర్ కె.చంద్ర డైరెక్ష‌న్ లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్క‌తున్న ఈ సినిమా నిన్న అధికారికంగా లాంఛ్ అయింది. ఈ చిత్రానికి ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ 40 రోజులు కేటాయించిన‌ట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఆసక్తికర టైటిల్స్ అన్ని ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ టైటిల్ ఖరారు చేసింది చిత్రబృందం. కాన్సెప్ట్ కు తగ్గట్లు ఈ సినిమాకి ‘బిల్లా రంగా’ టైటిల్ యాప్ట్ అవుతుందని భావించారు. ఇక బిల్లాగా ప‌వ‌ర్‌స్టార్, రంగాగా రానా నటించనున్నారు. కాగా 1982లో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ క్లాసిక్ మూవీ అప్ప‌ట్లో పెద్ద హిట్ అయ్యింది

Tags :
|

Advertisement