Advertisement

  • తనువులు వేరయినా లక్ష్యం ఒక్కటే ..పవర్ స్టార్ కు విషెస్ చెప్పిన మెగాస్టార్

తనువులు వేరయినా లక్ష్యం ఒక్కటే ..పవర్ స్టార్ కు విషెస్ చెప్పిన మెగాస్టార్

By: Sankar Wed, 02 Sept 2020 12:40 PM

తనువులు వేరయినా లక్ష్యం ఒక్కటే ..పవర్ స్టార్ కు విషెస్ చెప్పిన మెగాస్టార్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలతో మారుమోగిపోతుంది..గతంలో ఏ హీరోకి రానన్ని ట్వీట్లు చేయాలని పవన్ అభిమానులు ట్విట్టర్‌ను హీటెక్కిస్తున్నారు. అభిమానులే కాకుండా సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్‌కి విషెష్ అందిస్తున్నారు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి.. తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి విషెష్ అందిస్తూ ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోతో పాటు ఆసక్తికరమైన కొటేషన్‌ను షేర్ చేశారు.

తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే.. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే.. తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే.. తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ బాబు’ అంటూ విషెష్ అందించారు చిరంజీవి.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభకాంక్షలు చెప్పాడు ..హ్యాపీ బ‌ర్త్‌డే.. మీ విన‌య విధేయ‌త ఎప్పుడూ మార్పును ప్రేరేపిస్తాయి. మీరు ఎల్ల‌ప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి..అద్భుత‌మైన మ‌నిషి, నా ప్రియ‌ స్నేహితుడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. ఈ ఏడాదంతా నీకు ఆరోగ్యానందాలు ఉండాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నా అని విక్టరీ వెంకటేష్ అన్నారు..

Tags :
|

Advertisement