Advertisement

  • చికెన్ ఎలా చేయాలో నేర్పిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ...వైరల్ అవుతున్న వీడియో

చికెన్ ఎలా చేయాలో నేర్పిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ...వైరల్ అవుతున్న వీడియో

By: Sankar Mon, 02 Nov 2020 08:07 AM

చికెన్ ఎలా చేయాలో నేర్పిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ...వైరల్ అవుతున్న వీడియో


మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. కరోనా కారణంగా షూటింగ్ లు నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన చిరు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు.. కరోనా మహమ్మారి పట్ల ప్రజలకు అవగాహనా కల్పిస్తూ అప్పుడప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

ఇంతకముందు ఒకసారి చిరంజీవి తన తల్లికి స్వయంగా చేపల కూర చేసి పెట్టారు. ఆ విషయాన్నీ సోషల్ మీడియాద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి వంట వీడియోతో అభిమానుల ముందుకు వచ్చారు మెగాస్టార్. ఈ వీడియోలో కేఎఫ్‌సీ చికెన్ వండటం ఎలా అనేది తన మనవరాళ్లకు నేర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చిరు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. దాంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇక ప్రస్తుతం కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే... కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Tags :
|

Advertisement