Advertisement

  • రాజకీయాల్లోకి తిరిగి రావడంపై స్పందించిన మెగాస్టార్

రాజకీయాల్లోకి తిరిగి రావడంపై స్పందించిన మెగాస్టార్

By: Sankar Sat, 26 Dec 2020 4:20 PM

రాజకీయాల్లోకి తిరిగి రావడంపై స్పందించిన మెగాస్టార్


మెగాస్టార్ చిరంజీవి ..తెలుగులోనే గాక ఇండియాలోనే అత్యంత గొప్ప నటులలో ఒకరు ..దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు సినిమాను మకుటం లేని మహారాజులాగా ఏలిన మెగాస్టార్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వెళ్లారు ...2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు..అయితే ఆ ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ అనుకున్నంత విధంగా విజయం సాధించలేకపోయింది దీనితో తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు మెగాస్టార్..

తరువాత రాజకీయాలను వదిలి ఖైదీ నెం.150తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి అభిమానులకు వరుస సినిమాలను అందిస్తూ ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం చిరు ఆచార్య సినమాలో చేస్తున్నాడు. అయితే మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని, జాతీయ స్థాయి పార్టీలో రాజ్య సభ సభ్యుడిగా సీటు ఇచ్చేందుకు పార్టీ సిద్దంగా ఉందని వార్తలు వినిపించాయి.

అయితే ఆహా ఓటీటీ వేదికగా జరుగుతున్న శామ్ జామ్ ప్రోగ్రాంలో పాల్గొన్న చిరు తన పొలిటికల్ రీఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేశాడు. గడిచిన పదేళ్లలో నేను ఎంతో తెలుసుకున్నాను. రాజకీయాలు తనకు సెట్ అవ్వవని, రాజకీయాలోకన్నా మెగా స్టార్‌గానే నేను సంతోషంగా ఉన్నాని, మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పేశాడు

Tags :

Advertisement