Advertisement

  • ప్రకాష్ రాజ్‌ వ్యాఖ్యలపై మెగా బ్రదర్‌ నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్...

ప్రకాష్ రాజ్‌ వ్యాఖ్యలపై మెగా బ్రదర్‌ నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్...

By: chandrasekar Sat, 28 Nov 2020 7:55 PM

ప్రకాష్ రాజ్‌ వ్యాఖ్యలపై మెగా బ్రదర్‌ నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్...


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు సినీ నటుల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడాన్ని సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. `పవన్ కల్యాణ్ ఓ ఊసరవెళ్లి` అని విమర్శించారు. ప్రకాష్ రాజ్‌ వ్యాఖ్యలపై మెగా బ్రదర్‌ నాగబాబు ఘాటుగా స్పందించారు. ట్విటర్ ద్వారా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

`రాజకీయల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యాలు లాంగ్‌ టర్మ్‌లో ప్రజలకు, పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మా నాయకుడు పవన్‌ కల్యాణ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. పవన్ కల్యాణ్ ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు.

ప్రకాష్‌ రాజ్‌.. నీ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్‌లోనే అర్థం అయ్యింది. సుబ్రహ్మణ్య స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. బీజేపీ తీసుకునే నిర్ణయాలు నీకు నచ్చకపోతే విమర్శించు తప్పులేదు. అలాగే బీజేపీ గాని, మరే పార్టీ గాని మంచి చేస్తే హర్షించగలగాలి. విమర్శించడం తప్ప మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం. ఒకటి మాత్రం చెప్పగలను. ఈ దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ, జనసేన కూటమి శక్తిని ఆపలేరు. నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో, డేట్స్‌ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురిచేశావో అన్నీ గుర్తున్నాయి. ముందు నువ్వు మంచి మనిషిగా మారు. ఆ తర్వాత మాట్లాడు. డైరెక్టర్స్‌ని కాకా పట్టి నిర్మాతలను కాల్చుకు తినే నీకు ఇంత కంటే మంచిగా మాట్లాడడం ఏమి తెలుసు. బీజేపీ నేతల్ని నువ్వు ఎన్ని మాటల అన్నా వాళ్లు నిన్ను ఏమీ అనడం లేదంటే ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకో. మీడియా అడిగింది కదాని ఒళ్లు పొంగి నీ పనికి మాలిన రాజకీయ డొల్లతనాన్ని బయట వేసుకోకు` అంటూ నాగబాబు ఘాటుగా రిప్లై ఇచ్చారు.

Tags :
|

Advertisement