Advertisement

  • వైద్య సిబ్బందికి నాలుగు రాష్ట్రాలలో స‌రిగా జీతాలు ఇవ్వడం లేదు

వైద్య సిబ్బందికి నాలుగు రాష్ట్రాలలో స‌రిగా జీతాలు ఇవ్వడం లేదు

By: chandrasekar Sat, 01 Aug 2020 6:06 PM

వైద్య సిబ్బందికి నాలుగు రాష్ట్రాలలో స‌రిగా జీతాలు ఇవ్వడం లేదు


దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కరోనా ఫై పోరులో ముందున్న వారు వైద్య సిబ్బంది. ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులకు, నర్సులకు జీతాలు ఇవ్వక పోవడం అన్నింటికంటే పెద్ద నేరం. క‌రోనా పోరులో ముందున్న వైద్య సిబ్బందికి నాలుగు రాష్ట్రాలు స‌రిగా జీతాలు చెల్లించ‌లేదు. మ‌హారాష్ట్ర‌, పంజాబ్‌, క‌ర్నాట‌క‌, త్రిపుర రాష్ట్రాలు వైద్యులు, న‌ర్సుల‌కు స‌మ‌యానుకూలంగా వేత‌నాలు చెల్లించ‌లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

సుప్రీంకోర్టు జారీ చేసిన సూచ‌న‌ల‌ను ఈ రాష్ట్రాలు ప‌ట్టించుకోలేద‌ని చెప్పింది. అయితే కేంద్ర‌మే ఈ అంశంలో జోక్యం చేసుకోవాల‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. విప‌త్తునివార‌ణ చ‌ట్టం కింద కేంద్రానికి ఉన్న అధికారాల‌ను వినియోగించుకోవాల‌ని న్యాయ‌మూర్తులు అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎం ఆర్ షాతో కూడిన ధ‌ర్మాస‌నం చెప్పింది. ఈ మేర‌కు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. క‌రోనా పోరులో ముందున్న డాక్ట‌ర్లు, న‌ర్సుల‌కు జీతాలు చెల్లించ‌క‌పోవ‌డం నేరం కింద‌కు వ‌స్తుంద‌ని జూన్ నెల‌లో సుప్రీంకోర్టు తెలిపింది. కొంద‌రు డాక్ట‌ర్లు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా ఈ మేర‌కు తెలిప్పింది.

Tags :
|

Advertisement